Bullet Train Project: భారత్‌ బుల్లెట్‌ రైలు 2026కు సిద్ధం!

    దేశంలోనే ప్రతిష్ఠాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు.. 2026నాటికి తొలి ట్రయల్ రన్ చేసేలా వేగవంతమయ్యాయి. తొలిసారి భారత్‌లో జే-స్లాబ్ బాలాస్ట్ లెస్ ట్రాక్ సిస్టమ్ సాంకేతికతతో బుల్లెట్ ట్రైన్ పరుగెత్తనుంది.

Published : 24 Jun 2024 16:38 IST

300కిలో మీటర్ల గరిష్ఠ వేగం.. 508కి.మీ. ప్రయాణం.. రూ.లక్ష కోట్లకు పైగా వ్యయం.. ఇవి అన్ని దేశంలోనే ప్రతిష్ఠాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విశేషాలు. నెమ్మదిగా ప్రారంభమైన బుల్లెట్ రైలు పనులు.. ఇప్పుడు బుల్లెట్ వేగాన్ని అందుకుంటోంది. 2026నాటికి తొలి ట్రయల్ రన్ చేసేలా పనులు వేగవంతమయ్యాయి. తొలిసారి భారత్‌లో జే-స్లాబ్ బాలాస్ట్ లెస్ ట్రాక్ సిస్టమ్ సాంకేతికతతో బుల్లెట్ ట్రైన్ పరుగెత్తనుంది. అటు సముద్రం కింది నుంచి అలాగే సొరంగాలు, అటవీ ప్రాంతాలు దాటుకుంటూ బుల్లెట్ ట్రైన్ నడవనుంది. అహ్మదాబాద్ -ముంబయి కారిడార్‌తో పాటు భవిష్యత్‌లో 7 రూట్లలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. మరి, ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు