Bengaluru: బస్సులో అగ్నిప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు

బెంగళూరులో 30 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఎంజీ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

Published : 09 Jul 2024 19:13 IST

బెంగళూరులో 30 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఎంజీ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కోరమంగళ డిపోకు చెందిన బస్సు ఇంజిన్‌ను స్టార్ట్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు డ్రైవర్  తెలిపారు. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్.. ప్రయాణికులందరినీ కిందికి దింపి బస్సును ఖాళీ చేశారు. అనంతరం అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

Tags :

మరిన్ని