Income tax: బడ్జెట్‌లో ఆదాయ పన్ను రేట్లు తగ్గించే యోచనలో కేంద్రం

జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Updated : 18 Jun 2024 13:11 IST

జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తద్వారా వినియోగాన్ని పెంచాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్  ప్రవేశపెట్టనుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆదాయం వంటి అంశాల్లో కొన్ని వర్గాల వ్యతిరేకతే ఎన్నికల్లో భాజపాకు ఆశించిన ఫలితాలు రాలేదన్న అంచనాలున్నాయి. 

Tags :

మరిన్ని