Bandi Sanjay: ఏపీలో ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

తిరుమల శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు.

Published : 11 Jul 2024 11:32 IST

తిరుమల శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ ఏపీలో గత వైకాపా ప్రభుత్వ పాలకులు వీరప్పన్‌ వారసులు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేదు’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని