Kishanreddy: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

బల్కంపేట ఎల్లమ్మను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) దర్శించుకున్నారు.

Published : 09 Jul 2024 11:50 IST

బల్కంపేట ఎల్లమ్మను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) దర్శించుకున్నారు. అమ్మవారి కల్యాణ ఉత్సవం వైభవంగా సాగుతోందన్న కిషన్ రెడ్డి... ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని మొక్కుకున్నానన్న కేంద్రమంత్రి.. పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు.  కేంద్రం తరపున ఆలయ అభివృద్ధికి రూ.4.5 కోట్లు నిధులు మంజూరు చేశామన్న ఆయన.. త్వరలో ఆ నిధులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు.

Tags :

మరిన్ని