Pemmasani: కేంద్ర, ప్రపంచ బ్యాంకు నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది: కేంద్ర మంత్రి పెమ్మసాని

కేంద్రం, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించడంతో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

Published : 23 Jun 2024 16:41 IST

కేంద్రం, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించడంతో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్, అధికారులు, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. నగరంలో తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజ్, రహదారులు, ఇతర పనులకు కేటాయించిన రూ.వందల కోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించి, ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. దీంతో నగర వాసులకు అత్యవసరమైన మౌలిక వసతులు కల్పనకు కూడా నిధులు లేని దుస్థితి వచ్చిందన్నారు. 

Tags :

మరిన్ని