Chain Snatching: మహిళ మెడలో గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ.. సీసీ కెమెరా దృశ్యాలు

గుంటూరు జిల్లా మంగళగిరిలో వరుస గొలుసు దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Published : 22 Jun 2024 15:46 IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో వరుస గొలుసు దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మంగళగిరి ఏమ్‌ఎస్‌ఎస్‌ నగర్‌లో గత 2 రోజులుగా 3 వరుస గొలుసు దొంగతనాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మరో చోరీ జరిగింది. ఆరుబయట ముగ్గు వేస్తున్న మహిళ మెడలో నుంచి ఓ వ్యక్తి గొలుసు లాక్కొని బైక్ పై పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న వారు అత్యాధునిక బైక్‌లను వినియోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. వాటికి నెంబర్ ప్లేట్లు తొలగించి నడుపుతుండటంతో గుర్తించటం కష్టంగా మారుతోందని వెల్లడించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

Tags :

మరిన్ని