Chandrababu: 66 ఏళ్ల వయసు ఉన్నా అయ్యన్న ఇప్పటికీ ఫైర్‌ బ్రాండే: చంద్రబాబు

అసెంబ్లీలో అత్యంత సీనియర్‌ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు.

Published : 22 Jun 2024 12:19 IST

అసెంబ్లీలో అత్యంత సీనియర్‌ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. స్పీకర్‌గా అయ్యన్న ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడారు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమన్నారు. 66 ఏళ్ల వయసు ఉన్నా అయ్యన్న ఇప్పటికీ ఫైర్‌ బ్రాండే అని కొనియాడారు. ఎన్టీఆర్‌ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఏ పదవి ఇచ్చినా వన్నె తెచ్చారని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని