AP News: మంత్రులకు శిక్షణ ఇప్పిస్తాం: సీఎం చంద్రబాబు

‘శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Published : 13 Jun 2024 09:56 IST

‘శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమిస్తామని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లి నివాసంలో తనను కలిసిన మంత్రులతో చంద్రబాబు మాట్లాడారు. శాఖల వారీ శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. మరోవైపు ఏ మంత్రికి ఏ శాఖ అనేదానిపై కసరత్తు పూర్తిచేసి గురువారం బాధ్యతలు కేటాయించనున్నారు

Tags :

మరిన్ని