Chandrababu: సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే చెప్పా: చంద్రబాబు

ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Published : 22 Jun 2024 13:21 IST

ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఏపీలో శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘‘నా కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారు. మైకు ఇవ్వకుండా అవమానపరిచారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే గట్టిగా చెప్పా. కౌరవ సభకు రాను.. గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశా. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారు. సోషల్‌మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టారు. ప్రజలు అంతా గమనించి నన్ను గౌరవసభకు పంపారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలి. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలి. తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలనేదే నా కోరిక’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

మరిన్ని