Chandrababu: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కుటుంబసమేతంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated : 13 Jun 2024 14:21 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కుటుంబసమేతంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం రోడ్డు మార్గాన తిరుచానూరుకు చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకి తితిదే అధికారులు, అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు అందజేశారు. తితిదే అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. 

Tags :

మరిన్ని