Chevireddy: ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ స్థలాలను కొట్టేసిన చెవిరెడ్డి

రూ.కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను తిరుపతికి చెందిన వైకాపా నేత, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కారుచౌకగా కొట్టేశారు.

Published : 25 Jun 2024 09:40 IST

రూ.కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను తిరుపతికి చెందిన వైకాపా నేత, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కారుచౌకగా కొట్టేశారు. ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చెందిన సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట ఆర్టీసీ స్థలాలకు అగ్రిమెంట్‌ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అద్దంకి డిపోల పరిధిలోని స్థలాలను లీజు పేరుతో దక్కించుకున్నారు. గత ఏడాది నవంబరులో ఆర్టీసీ అధికారులు వీటికి టెండర్లు పిలవగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పదిహేనేళ్లకు లీజు ఒప్పందం చేసుకున్నారు. ఈ స్థలాల కోసం పలువురు పోటీపడినా వారిని బెదిరించి.. వారంతట వారే టెండర్ల నుంచి తప్పుకొనేలా చేసి, కుమారుడి సంస్థకు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని