ఐదుగురు ప్రధాన మంత్రులు మారినా.. 13 ఏళ్లుగా ‘వేటగాడు’మాత్రం అక్కడే!

బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్‌ స్ట్రీట్‌ (10)లో అడుగుపెట్టిన కీర్‌ స్టార్మర్‌కు.. ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికింది.

Updated : 06 Jul 2024 13:14 IST

బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్‌ స్ట్రీట్‌ (10)లో అడుగుపెట్టిన కీర్‌ స్టార్మర్‌కు.. ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికింది. అదే ల్యారీ అనే పిల్లి. డౌనింగ్‌ స్ట్రీట్‌లోకి ఆరుగురు ప్రధానమంత్రులు వచ్చినా.. 13 ఏళ్లుగా ఆ రాజ మార్జాలం మాత్రం అక్కడే మకాం వేయడం గమనార్హం. బ్రిటన్‌ ప్రధానమంత్రి అధికారిక నివాసమైన ‘నంబర్‌ 10 డౌనింగ్‌ స్ట్రీట్‌’కు పునాదులు గట్టిగా లేకపోవడం, ఎలుకల బెడద వంటి సమస్యలు ఆది నుంచీ వెంటాడుతున్నాయి.  ప్రధాని నివాసంలో ఎలుకల నుంచి బయటపడేందుకు 2011లో (డేవిడ్‌ కామెరూన్‌) బ్యాటర్‌సీ హోం నుంచి ‘ల్యారీ’ అనే పిల్లిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ మార్జాలం.. ‘చీఫ్‌ మౌసర్‌’గా అక్కడే ఉండిపోయింది. మంత్రులు, అధికారులు, మీడియాతో ఆ ప్రాంగణమంతా హడావుడిగా ఉన్నా.. అది మాత్రం దర్జాగా సంచరిస్తుంది.

Tags :

మరిన్ని