China: చైనాలో భారీగా వరదలు... నీట మునిగిన జిన్‌షన్ ఆలయం

తూర్పు చైనాలో సంభవించిన భారీ వరదల కారణంగా జిన్‌షన్ దేవాలయం నీట మునిగింది. ఫుజియన్ ప్రావిన్స్‌లోని ఫూజౌ నగరంలో ఈ దేవాలయం ఉంది.

Updated : 20 Jun 2024 15:19 IST

తూర్పు చైనాలో సంభవించిన భారీ వరదల కారణంగా జిన్‌షన్ దేవాలయం నీట మునిగింది. ఫుజియన్ ప్రావిన్స్‌లోని ఫూజౌ నగరంలో ఈ దేవాలయం ఉంది. ఈ నెల 9 నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో స్థానిక ఉలాంగ్ జియాంగ్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డున నిర్మించిన జిన్‌షన్ ఆలయంలోకి వరద నీరు చేరింది. వరద ధాటికి షంగ్ హంగ్ కౌంటీలో నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగినట్లు చెప్పారు. ధ్వంసమైన మౌళిక వసతులను పునరుద్ధరిస్తున్నట్లు స్థానిక యంత్రాంగం వెల్లడించింది.

Tags :

మరిన్ని