South China Sea: ఫిలిప్పీన్స్‌ నేవీపై కత్తులు, గొడ్డళ్లతో చైనా దళాల దాడి!

గల్వాన్‌లో భారత దళాలపై పదునైన ఆయుధాలతో కయ్యానికి కాలు దువ్వినట్లే.. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ బలగాలు దాడికి తెగబడ్డాయి. బీజింగ్‌ మూకలు ఫిలిప్పీన్స్‌ నేవీపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశాయి. 

Published : 20 Jun 2024 18:40 IST

ఫిలిప్పీన్స్‌ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్‌ గార్డ్‌ బలగాలు దాడులు చేశాయి. వారి పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో  ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్స్ అధికారులు స్పందిస్తూ.. తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు సెకండ్‌ థామస్‌ షోల్‌కు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్లు వెల్లడించారు.

Tags :

మరిన్ని