Chandrababu: 2026 జూన్‌లోగా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం: చంద్రబాబు

2026 జూన్‌లోపే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెల్లడించారు.

Published : 11 Jul 2024 16:29 IST

2026 జూన్‌లోపే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం విమానాశ్రయాన్ని చిన్నాభిన్నం చేసిందని, మొత్తం పనులు మొదటి నుంచి చేయాల్సి వస్తోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు.  అనంతరం అధికారులు, నేతలతో భేటీ అయ్యారు. నిర్మాణ పనులపై జీఎంఆర్‌ ప్రతినిధులను ఆరా తీశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎకనామిక్‌ హబ్‌గా మారుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

Tags :

మరిన్ని