Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలి: చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో మీడియాతో మాట్లాడారు.

Updated : 13 Jun 2024 13:25 IST

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్నికల్లో ఘన విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని