Chandrababu: సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే..!

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు.. అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు.

Published : 13 Jun 2024 09:28 IST

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు.. అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీ, నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపు, పేదల ఆకలి తీర్చేలా అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయంలో గురువారం సాయంత్రం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సంతకాలు చేస్తారు. 

Tags :

మరిన్ని