Chandrababu: బెజవాడ దుర్గమ్మ సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.

Published : 13 Jun 2024 15:51 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఇంద్రకీలాద్రికి వచ్చిన చంద్రబాబుకు దేవాదాయ శాఖ కమిషనర్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, ఈవో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సంప్రదాయ నృత్య కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Tags :

మరిన్ని