భారాసకు మనుగడ లేక.. నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు: సీఎం రేవంత్‌

డీఎస్సీ, గ్రూపు పరీక్షలు వాయిదా వేయాలన్న అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పరీక్షలు వాయిదా వేసే వరకు కేటీఆర్ (KTR), హారీశ్‌రావు (Harish rao) ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Published : 10 Jul 2024 09:43 IST

డీఎస్సీ, గ్రూపు పరీక్షలు వాయిదా వేయాలన్న అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పరీక్షలు వాయిదా వేసే వరకు కేటీఆర్ (KTR), హారీశ్‌రావు (Harish rao) ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భారాసకు మనుగడ లేదనుకున్న ప్రతిసారీ నిరుద్యోగులని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పరీక్షలు వాయిదా వేస్తే సర్కారుకి నష్టం లేదన్న రేవంత్.. నిరుద్యోగులు నష్టపోకూడదన్నదే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భారాసలో చేర్చుకున్నప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌కి ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా? అంటూ ఎదురుదాడికి దిగారు. 

Tags :

మరిన్ని