Revanth Reddy: చంద్రబాబుతో పోటీ.. రోజుకు 18 గంటలు పనిచేయాల్సిందే: రేవంత్‌రెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy) అన్నారు.

Published : 22 Jun 2024 16:52 IST

ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy) అన్నారు. ‘చంద్రబాబు 18 గంటలు పనిచేసి.. నేను 12 గంటలు పని చేస్తే సరిపోదు. తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి.. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి’ అని రేవంత్ పేర్కొన్నారు. బసవతారకం ఆసుపత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న రేవంత్‌.. క్యాన్సర్‌ రోగులకు ఆ ఆస్పత్రి అందిస్తున్న సేవలను కొనియాడారు. హైదరాబాద్‌లో హెల్త్‌ టూరిజం హబ్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.  

Tags :

మరిన్ని