Revanth reddy: రైతు సంక్షేమం విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తాం: సీఎం రేవంత్

రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 21 Jun 2024 13:52 IST

తెలంగాణ మాజీ స్పీకర్‌, భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడూ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. వ్యవసాయం దండగ కాదని.. పండగ చేసే బాధ్యత తమదని చెప్పారు. రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి మద్దతు తీసుకుని ముందుకెళ్తామన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు