CM Revanth Reddy: జాతీయ రహదారుల కోసం భూ సేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలి: సీఎం రేవంత్‌

జాతీయ రహదారుల కోసం భూసేకరణ విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Published : 10 Jul 2024 21:01 IST

జాతీయ రహదారుల కోసం భూసేకరణ విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడటంతోపాటు.. నిబంధనల మేరకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చొరవ తీసుకోవాలని తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబరు కేటాయించేందుకు అవసరమైన చర్యలతోపాటు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, NHAI మధ్య త్రైపాక్షిక ఒప్పందానికి అవసరమైన ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.

Tags :

మరిన్ని