Container Health Sub Centre: కంటెయినర్‌లో అదనపు ఆరోగ్య ఉపకేంద్రం.. ములుగు జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన

మన్యం ప్రాంతవాసులకు అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన చేశారు. గిరిజినులకు  వైద్య సేవలందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్‌ దివాకర.. కంటెయినర్ రూపంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలని నిర్ణయించారు.

Published : 09 Jul 2024 16:09 IST

మన్యం ప్రాంతవాసులకు అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన చేశారు. మన్యం ప్రాంతంలో రవాణా సౌకర్యం లేక సరైన సమయంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించి గిరిజినులకు  వైద్య సేవలందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్‌ దివాకర ఓ వినూత్న ప్రయోగం చేశారు. కంటెయినర్ రూపంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలని నిర్ణయించారు. జాతీయ రహదారికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలం పోచాపూర్ గ్రామానికి చుట్టూ నర్సాపూర్, అల్లిగూడెం, బందాల, బొల్లేపల్లి గ్రామాలున్నాయి. ఇక్కడి ప్రాంతవాసులు వైద్యం కోసం గోవిందరావుపేట మండలం పస్రా నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కలెక్టర్.. అత్యవసర సేవల కోసం కంటెయినర్‌లో ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటుచేసి ఆరు నెలలు సేవలందిచాలనుకున్నారు. నాలుగు పడకల కోసం సుమారు రూ.7 లక్షల వ్యయంతో దీన్ని రూపొందించారు. 

Tags :

మరిన్ని