Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్టుకు మహర్దశ ప్రారంభమైందా..?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జెట్ స్పీడ్‌తో పూర్తి కానున్నాయా? పక్కా ప్రణాళికతో నిర్ణీత గడువులోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడుపైనే ఇక్కడి ప్రజలు ఆశలు పెటుకున్నారు.

Published : 19 Jun 2024 18:45 IST

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జెట్ స్పీడ్‌తో పూర్తి కానున్నాయా? పక్కా ప్రణాళికతో నిర్ణీత గడువులోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీనంతటికీ కారణం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈయనపైనే ఇక్కడి ప్రజలు ఆశలు పెటుకున్నారు. జ్యోతిరాధిత్య సింథియా, అశోక్ గజపతిరాజు వంటి సీనియర్లతో చర్చించి.. భోగాపురం సహా రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధిలో తన మార్క్ ఉండేలా చిత్తశుద్ధితో పనిచేస్తానంటున్నారు రామ్మోహన్ నాయుడు. ఈ నేపథ్యంలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ భూ సేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు లాంటి సమస్యలపైనా మంత్రి ఫోకస్ చేయనున్నారు. మరి, ఉత్తరాంధ్రకే మణిహారంగా మారిన భోగాపురం ఎప్పుడు పూర్తవుతుంది? అసలు ఇప్పటివరకు జరిగిన పనులేంటి? తెలుసుకుందాం.

Tags :

మరిన్ని