YS Sharmila: కడపలో నేను ఓడిపోవడానికి కారణం అదే!: వైఎస్ షర్మిల

హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదనే తాను కడప పార్లమెంట్ స్థానానికి పొటీ చేశానని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. విజయవాడలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల్లో వైకాపా నేతలు విపరీతంగా డబ్బులు పంపిణీ చేశారని షర్మిల ఆరోపించారు.

Published : 19 Jun 2024 21:17 IST

హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదనే తాను కడప పార్లమెంట్ స్థానానికి పొటీ చేశానని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. విజయవాడలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల్లో వైకాపా నేతలు విపరీతంగా డబ్బులు పంపిణీ చేశారని షర్మిల ఆరోపించారు. అధికార పార్టీకి వ్యతిరేంకంగా ఓటు వేస్తే.. సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడంతో పాటు దాడులు చేసి, అక్రమ కేసులు పెడతారని కడప ప్రజలు భయపడ్డారని చెప్పారు. తాను కడపలో కేవలం 14 రోజులే ప్రచారం చేశానని, గ్రామీణ ప్రాంతాల్లో తాను పోటీ చేస్తునట్లు చాలా మందికి తెలియదన్నారు. హంతకుల పాపం పండే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహించాలన్న అంశంపై మేధావులు, సుప్రీం కోర్టు కలిసి చర్చిస్తే బాగుంటుందని ఆమె సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని, ఇటువంటి పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక కమిటీ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో సీట్లు ఎవరికి ఇవ్వాలి?, ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే అంశాన్ని అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. సీట్లు సరిగా ఇవ్వలేదని కొంతమంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని