KTR: పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్‌: కేటీఆర్‌

పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు.

Published : 09 Jul 2024 13:41 IST

పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. దిల్లీలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో గులాబీ నేతల్ని చేర్చుకుంటున్న కాంగ్రెస్‌పై తప్పకుండా పోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామమంటున్న రాహుల్  గాంధీ.. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపులకు సమాధానం చెప్పాలన్నారు. భారాస నేతలు పార్టీ మారేందుకు కాంగ్రెస్ ఎంత డబ్బు వెచ్చిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు