TG Congress: తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాకపోవడంపై ఆరా

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన స్థానాల్లో విజయం సాధించకపోవడంపై కాంగ్రెస్ మదనం చేస్తోంది.

Published : 11 Jul 2024 09:42 IST

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన స్థానాల్లో విజయం సాధించకపోవడంపై కాంగ్రెస్ మదనం చేస్తోంది. అందులో భాగంగా ఏఐసీసీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ ఫలితాలపై ఆరా తీయనుంది. మూడ్రోజులపాటు రాష్ట్రంలో అభ్యర్థులు సహా పలువురు ప్రతినిధులతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు సమావేశమై వాస్తవ పరిస్థితి తెలుసుకోనున్నారు. నేతలతోనే సమావేశం అవుతారా లేక క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టతలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపై లోతైన అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితిపై ఏఐసీసీకి కమిటీ నివేదిక ఇవ్వనుంది.

Tags :

మరిన్ని