TS News: పూర్థిస్థాయి బడ్జెట్‌ కోసం ఆర్థిక శాఖ కసరత్తు

తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకోసం వచ్చే మంగళవారం నుంచి సన్నాహక సమావేశాలు జరగనున్నాయి.

Published : 13 Jun 2024 10:08 IST

తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకోసం వచ్చే మంగళవారం నుంచి సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. అన్నిశాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క భేటీ కానున్నారు. ఆయాశాఖల పరిధిలోని పథకాల వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి పద్దులను సిద్ధం చేయనున్నారు. ఇటీవలి ప్రభుత్వ ప్రకటనలను దృష్టిలో ఉంచుకొని కొత్త పథకాలకయ్యే ఖర్చు వివరాలను ప్రత్యేకంగా రూపొందించాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

Tags :

మరిన్ని