Addanki Dayakar: ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి: అద్దంకి దయాకర్

కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల సంఘం పనితీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ డిమాండ్  చేశారు. భారత్‌లో జరిగిన ఎన్నికలపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని దయాకర్ వెల్లడించారు.

Published : 18 Jun 2024 20:51 IST

కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల సంఘం పనితీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ డిమాండ్  చేశారు. భారత్‌లో జరిగిన ఎన్నికలపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని దయాకర్ వెల్లడించారు. 2018 ఎన్నికల్లో జరిగిన అవకతవకలను.. మస్క్ చెప్పిన అభ్యంతరం రూపంలో వింటున్నట్లు ఉందని వివరించారు. మళ్లీ బ్యాలెట్ విధానం తేవాలన్న డిమాండ్లు రావడానికి ఈవీఎంలపై అనుమానాలే కారణమని అద్దంకి దయాకర్  చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం మార్పుతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశాలు అధికంగా ఉండడంతో.. దేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని మార్చేసే పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని అద్దంకి దయాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని