Hyderabad: చైన్‌ స్నాచర్లు, మొబైల్ దొంగలపై పోలీసుల ఉక్కుపాదం

హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతున్న చైన్‌ స్నాచర్లు, మొబైల్ దొంగలు, దోపిడీ దొంగల భరతం పట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు.

Published : 25 Jun 2024 13:15 IST

హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతున్న చైన్‌ స్నాచర్లు, మొబైల్ దొంగలు, దోపిడీ దొంగల భరతం పట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏడు పోలీస్ జోన్ల పరిధిలో డీసీపీ నుంచి హోంగార్డు స్థాయి వరకు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. వివిధ నేరాల్లో తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్తులపై నిఘా పెంచారు. స్థానిక పోలీసులు, యాంటీ స్నాచింగ్ టీమ్స్.. నేరస్తుల కదలికలను గమనిస్తున్నారు. అనుమానితులు, ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటున్నారు. మూడ్రోజుల వ్యవధిలో సుమారు 150కి పైగా కేసులు నమోదు చేశారు.

Tags :

మరిన్ని