Tadepalli: తాడేపల్లిలో వైకాపా కార్యాలయం కూల్చివేత

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరులశాఖకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేశారు.

Published : 22 Jun 2024 12:47 IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరులశాఖకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేశారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బోటు యార్డులోని జలవనరులశాఖకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకే లీజుకు కట్టబెట్టారు. ఏటా రూ.2 వేల చెల్లించేలా జీవో తెచ్చారు. ఈ స్థలంలో జీ ప్లస్ టులో కార్యాలయం నిర్మించేందుకు వైకాపా నేతలు నిర్మాణాలు ప్రారంభించారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జలవనరులశాఖ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్నారంటూ సీఆర్‌డీఏ అధికారులు 4 రోజుల క్రితం వైకాపాకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వైకాపా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఆర్‌డీఏకు కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం 5 బుల్డోజర్లతో వైకాపా నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. కేవలం 2 గంటల్లోనే కూల్చివేతను అధికారులు పూర్తి చేశారు. 

Tags :

మరిన్ని