Viral Video: వరదలో చిక్కుకున్న కారు డ్రైవర్‌.. ఎలా రక్షించారో చూశారా!

స్పెయిన్‌లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదలో చిక్కుకున్న కారు నుంచి కదలలేని స్థితిలో ఉన్న డ్రైవర్‌ను హెలికాప్టర్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

Published : 13 Jun 2024 19:14 IST

స్పెయిన్‌లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదలో చిక్కుకున్న కారు నుంచి కదలలేని స్థితిలో ఉన్న డ్రైవర్‌ను హెలికాప్టర్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ ఘటన మార్సియాలో జరిగింది. స్థానికంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వరద ఉద్ధృతిలో ఒక కారు చిక్కుకుందని చెప్పారు. దాని డ్రైవర్ చలనరహితంగా పడిఉన్నట్లు తెలిసి అతణ్ని రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదలో కారు పైకప్పును తొలగించి హెలికాప్టర్ సాయంతో డ్రైవర్‌ను సురక్షితంగా బయటకి తీశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం మూడు ఫైర్ ఇంజన్లు, ఒక హెలికాప్టర్‌ను వినియోగించినట్లు అధికారులు చెప్పారు. డ్రైవర్‌కు ఎలాంటి హానీ జరగలేదని వివరించారు.

Tags :

మరిన్ని