Siraj: హైదరాబాద్‌లో సిరాజ్‌ విజయోత్సవ ర్యాలీ.. అభిమానుల జేజేలు

టీ20 ప్రపంచకప్‌-2024 విజేత భారత్‌ జట్టులో సభ్యుడైన సిరాజ్‌కు (Siraj) శుక్రవారం క్రికెట్‌ అభిమానులు ఘనస్వాగతం పలికారు.

Published : 06 Jul 2024 10:43 IST

టీ20 ప్రపంచకప్‌-2024 విజేత భారత్‌ జట్టులో సభ్యుడైన సిరాజ్‌కు (Siraj) శుక్రవారం క్రికెట్‌ అభిమానులు ఘనస్వాగతం పలికారు. మెహిదీపట్నం సరోజిని దేవి కంటి ఆస్పత్రి వద్ద పీవీ ఎక్స్‌ప్రెస్‌పై జీప్‌ ఓపెన్‌ టాప్‌ నుంచి అతడు అభివాదం చేయగా అభిమానులు ‘‘ఇండియా.. ఇండియా.. ఇండియా...వీ లవ్‌ యూ సిరాజ్‌ భాయ్‌’’ అంటూ కేరింతలు కొట్టారు. రాత్రి 7.22 గంటలకు ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, ఖాజామేన్షన్, పోలీస్‌ ఆఫీసర్స్‌మెస్, నషేమన్‌ హోటల్‌ మీదుగా ఫస్ట్‌లాన్సర్‌లోని ఈద్గా మైదానం వరకు సాగింది.

Tags :

మరిన్ని