YSR District: పంటపొలంలో ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంట్‌ తీగలు.. రైతుకు తప్పని ఇబ్బందులు!

పంటపొలంలో చేతికి అందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతుండటంతో సాగు చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన తుమ్మ గంగయ్య అనే రైతు...పొలం సాగు చేస్తున్నాడు. అయితే మూడేళ్లుగా ఆయన పొలంలో విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని సదరు రైతు కోరుతున్నాడు.

Published : 09 Jul 2024 20:38 IST

పంటపొలంలో చేతికి అందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతుండటంతో సాగు చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన తుమ్మ గంగయ్య అనే రైతు...పొలం సాగు చేస్తున్నాడు. అయితే మూడేళ్లుగా ఆయన పొలంలో విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నాయి. ఫలితంగా విత్తనాలు వేయడం దగ్గర నుంచి పంట పండించేవరకూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. పలుమార్లు విద్యుత్ తీగల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. చేసేది ఏమీలేక పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను ప్లాస్టిక్ పైపుల సాయంతో పైకి పట్టుకుని పసుపు విత్తనాలతో దుక్కి దున్నాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి ప్లాస్టిక్ పైపుల సాయంతో విద్యుత్ తీగలను పట్టుకుని వ్యవసాయం చేస్తున్న రైతు అంటూ..  సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంతో వైరల్‌గా మారింది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని సదరు రైతు కోరుతున్నాడు.

Tags :

మరిన్ని