Darling Trailer: ‘అపరిచితుడు’లా నభా నటేశ్‌.. ఆసక్తిగా ‘డార్లింగ్‌’ ట్రైలర్‌

ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. వై దిస్‌ కొలవెరి అనేది ఉపశీర్షిక. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది.

Updated : 07 Jul 2024 12:15 IST

‘అపరిచితుడు’లో ఒకే ఫ్రేమ్‌లో విభిన్న హావభావాలు పలికిస్తూ ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశారు నటుడు విక్రమ్‌. ‘డార్లింగ్‌’ (Darling)లో హీరోయిన్‌ నభా నటేశ్‌ (Nabha Natesh) అలానే కనిపించనున్నారు. సీరియస్‌ రోల్‌కాదుగానీ ఫన్నీ క్యారెక్టర్‌ ప్లే చేశారు. ప్రియదర్శి ( Priyadarshi) కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. అశ్విన్‌ రామ్‌ దర్శకుడు. ఈ మూవీ జులై 19న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని (Darling Trailer) ఆదివారం విడుదల చేసింది. హనీమూన్‌కు పారిస్‌ వెళ్లాలని బాల్యంలోనే నిర్ణయించుకున్న హీరో.. ప్రేమ పెళ్లి చేసుకుంటాడు. తన భార్యకు ‘స్ల్పిట్‌ పర్సనాలిటీ’ రుగ్మత ఉందని తెలిశాక అతడి పరిస్థితేంటి? అనుకున్నట్టే హనీమూన్‌కు పారిస్‌ వెళ్లాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

మరిన్ని