Chips: చిప్స్ ప్యాకెట్‌లో.. కుళ్లిపోయిన కప్ప

పిల్లలు ఇష్టంగా తిందామని కొనుగోలు చేసిన చిప్స్ ప్యాకెట్‌లో కుళ్లిన కప్పను చూసి గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి నిర్ఘాంతపోయాడు.

Updated : 20 Jun 2024 16:13 IST

పిల్లలు ఇష్టంగా తిందామని కొనుగోలు చేసిన చిప్స్ ప్యాకెట్‌లో కుళ్లిన కప్పను చూసి గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. జామ్‌నగర్‌కు చెందిన జాస్మిన్ పటేల్ మంగళవారం సాయంత్రం ఓ దుకాణంలో ఆలు చిప్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చాక తర్వాత తన కుమార్తె ఆ ప్యాకెట్‌లోని కొన్ని చిప్స్‌ను తిన్నట్లు చెప్పారు. అనంతరం అందులో కప్ప కళేబరాన్ని గుర్తించిన తన మేనకోడలు ఆ ప్యాకెట్‌ను నేలపై పడవేసినట్లు తెలిపారు. తనతో జరిగిన విషయం చెప్పగా.. మొదట నమ్మలేదని, కానీ కప్పను చూసి తాను భయపడినట్లు పటేల్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు కుళ్లిన స్థితిలో ఉన్న కప్ప కళేబరాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. 

Tags :

మరిన్ని