Jagan-Lotus Pond: జగన్‌ నివాసం లోటస్‌పాండ్‌ వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్‌ పాండ్‌ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్‌ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్‌ఎంసీ తొలగించింది. రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుతో జీహెచ్‌ఎంసీ అధికారులు మూడు షెడ్లను కూల్చేశారు.

Published : 15 Jun 2024 14:25 IST

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్‌ పాండ్‌ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్‌ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్‌ఎంసీ తొలగించింది. రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుతో జీహెచ్‌ఎంసీ అధికారులు మూడు షెడ్లను కూల్చేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని లోటస్‌ పాండ్‌ సిబ్బందికి జీహెచ్ఎంసీ, పోలీసులు నిన్ననే ఆదేశాలు జారీ చేశారు.  రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలతో రాకపోకలకు ఇబ్బంది మారిందని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags :

మరిన్ని