Kalki 2898AD: కర్ణుడిగా ప్రభాస్‌.. కల్కి ఎవరంటే?: నాగ్‌ అశ్విన్‌

మహాభారతంలో తనకు కర్ణుడి పాత్ర నచ్చుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.

Published : 06 Jul 2024 15:55 IST

‘కల్కి 2898ఏడీ’ ప్రపంచ బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ తెలుగు సినిమా సత్తా చాటుతోంది. సినిమా టైటిల్‌ను చూసి హీరో ప్రభాసే కల్కిగా కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ, పార్ట్‌ 1లో ప్రభాస్‌ను కర్ణుడిగా రివీల్‌ చేశారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin). అయితే కల్కిగా సినిమాలో ఏ హీరో కనిపించనున్నారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘కల్కి’ సెట్స్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాగ్‌ అశ్విన్‌.. ఈ అంశంపై స్పందించారు. అంతేకాదు, మహాభారతంలో తనకు కర్ణుడి పాత్ర నచ్చుతుందని తెలిపారు.

Tags :

మరిన్ని