Nag Ashwin: ఆర్జీవీని అడిగితే.. ‘నేనెందుకు నీ సినిమాలో ఉండాలి’ అన్నారు!: నాగ్‌ అశ్విన్‌

‘కల్కి 2898ఏడీ’లో నటించడం కోసం ఆర్జీవీని అడగ్గా.. ‘నేనెందుకు నీ సినిమాలో ఉండాలి’ అని దర్శకుణ్ని ఆయన అడిగారట.

Published : 06 Jul 2024 16:41 IST

‘కల్కి 2898ఏడీ’తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin). ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందడానికి అతిథి పాత్రలు సైతం ఓ కారణమని చెప్పొచ్చు. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తొలిసారిగా నటించింది ఈ సినిమాలోనే. ‘కల్కి’లో నటించడం కోసం ఆర్జీవీని అడగ్గా.. ‘నేనెందుకు నీ సినిమాలో ఉండాలి’ అని దర్శకుణ్ని ఆయన అడిగారట. దానికి ‘మీరు కలియుగం వరకు ఉంటారని అనిపిస్తుంది సార్‌’ అని తాను చమత్కరించినట్లు నాగ్ అశ్విన్‌ మీడియాతో పంచుకున్నారు.

Tags :

మరిన్ని