Nag Ashwin: వారిద్దరూ నాకు లక్కీ ఛార్మ్‌..!: నాగ్‌ అశ్విన్‌

విజయ్‌ దేవరకొండ, మాళవిక నాయర్‌ తనకు లక్కీ ఛార్మ్‌ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెలిపారు.

Updated : 06 Jul 2024 17:21 IST

విజయ్‌ దేవరకొండ, మాళవిక నాయర్‌ తనకు లక్కీ ఛార్మ్‌ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెలిపారు. ‘కల్కి 2898ఏడీ’లో విజయ్‌, మాళవిక అలరించిన విషయం తెలిసిందే. అయితే నాగ్‌ అశ్విన్‌ ప్రతి సినిమాలోనూ వీరిద్దరూ నటించడం గమనార్హం. ‘కల్కి’ విజయంపై ఆ మూవీ సెట్స్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాగ్‌ అశ్విన్‌.. ఈ విషయంపై స్పందించారు. ‘నా తొలి సినిమా నటులు కాబట్టి నాకెప్పుడూ ప్రత్యేకమే. వారు నాకు లక్కీ ఛార్మ్‌. వాళ్లతో కలిసి పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుంది’ అని పేర్కొన్నారు. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి సినిమాల్లో విజయ్‌, మాళవిక నటించారు.  

Tags :

మరిన్ని