TS News: ప్రాధాన్యకర ప్రాజెక్టుల పనుల పూర్తిపై సర్కార్‌ దృష్టి

ప్రాధాన్యకర ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి ఈ ఏడాది ఆరు లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు అదనంగా సాగునీరందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Published : 09 Jul 2024 11:58 IST

ప్రాధాన్యకర ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి ఈ ఏడాది ఆరు లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు అదనంగా సాగునీరందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 75 శాతానికి పైగా పనులు పూర్తైన, తక్కువవ్యయం అవసరమయ్యే 19 ప్రాజెక్టులను ప్రాధాన్యకరంగా నీటిపారుదలశాఖ గుర్తించింది. వాటికి రూ.19 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా. సదర్ మట్ ఆనకట్టను నెలాఖరులో సీతారామ ప్రాజెక్టులో భాగంగా రాజీవ్ గాంధీ కాల్వను ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు.

Tags :

మరిన్ని