KCR: కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో విరక్తి!: భారాస అధినేత కేసీఆర్‌

అధికారంలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు తీవ్ర విరక్తి చెందారని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Published : 04 Jul 2024 12:22 IST

అధికారంలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు తీవ్ర విరక్తి చెందారని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తన చేష్టలతో తానే ప్రజల చేత ఛీకొట్టించుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ వైఖరి అని, ఈ విషయం మన కళ్ల ముందు కనిపిస్తోందని విమర్శించారు. శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ.. అప్రతిహతంగా సాగుతున్న భారాస విజయ ప్రస్థానంలో ఇటీవల ఓటమితో దిష్టి తీసినట్లయిందని చెప్పారు. గెలుపు, ఓటములకు అతీతంగా భారాసకు తెలంగాణ సమాజం ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని కేసీఆర్‌ అన్నారు. పునరుత్తేజంతో మరింత ప్రజాదరణ కూడగట్టాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు