Dog Attack: కరీంనగర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం

కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. శునకం దాడిలో 14 మంది గాయపడ్డారు.

Published : 14 Jun 2024 19:20 IST

కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. శునకం దాడిలో 14 మంది గాయపడ్డారు. కార్యాలయంలో వివిధ పనుల వచ్చే వారిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచింది. కుక్క దాడికి గురైన తహసీల్దార్‌తో పాటు ధరణి ఆపరేటర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరిలించారు. పలువురిని కరిచిన పిచ్చికుక్కను కర్రలతో కొట్టి చంపారు. నిత్యం జిల్లా పరిపాలనాధికారి కార్యాలయానికి వచ్చేవారు కుక్కల బెడదతో భయాందోళనలకు గురవుతున్నారు.

Tags :

మరిన్ని