Ramoji Rao: ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలనేదే రామోజీరావు లక్ష్యం: డీఎన్‌ ప్రసాద్

చేసే ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలనేదే రామోజీరావు లక్ష్యం అని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్‌ ప్రసాద్ తెలిపారు. రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా డీఎన్‌ ప్రసాద్ మాట్లాడారు.

Published : 16 Jun 2024 15:17 IST

చేసే ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలనేదే రామోజీరావు లక్ష్యం అని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్‌ ప్రసాద్ తెలిపారు. రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా డీఎన్‌ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘రిపోర్టర్‌గా చేరి అడ్మినిస్ట్రేషన్‌కు వెళ్లడంతో ఎక్కువసార్లు ఛైర్మన్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఎప్పుడూ చదువుతూనే ఉండేవారు. అందులో బాగున్నవి, బాగా లేనివి మార్క్‌ చేసేవారు. ఇప్పటికీ ఆయన లేరనే ఆలోచన రావడం లేదు. ఏ వ్యాపారం అయినా కొత్తగా ఆలోచించేవారు. ప్రతి ఐడియాను రాసి పెట్టుకొనేవారు. అనుకున్న సమయానికి పనిని పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికను ముందే వేసుకొని.. వాటిని సాధించేవారు’’ అని చెప్పారు.    

Tags :

మరిన్ని