Congress: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ కసరత్తు

తెలంగాణ కాంగ్రెస్ నూతన రథసారథితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిని మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది.

Published : 23 Jun 2024 13:24 IST

తెలంగాణ కాంగ్రెస్ నూతన రథసారథితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిని మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్లాల్సి ఉండడంతో.. అధ్యక్ష పదవి విషయంలో ఆచితూచి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా రాజస్థాన్ మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొత్తగా తెరపైకి వచ్చినట్లు సమాచారం.

Tags :

మరిన్ని