Hyderabad: భర్త వివాహేతర సంబంధం.. పసిగట్టి దేహశుద్ధి చేసిన భార్య

భర్త వివాహేతర సంబంధాన్ని పసిగట్టి.. అతడికి భార్య దేహశుద్ధి చేసిన ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ డీడీ కాలనీలో జరిగింది. ఓ యువతితో ప్రవీణ్ సహజీవనం చేస్తున్నాడని తెలుసుకొని.. తన పిల్లలతో కలిసి వారిద్దరిపై ఆమె దాడి చేసింది.

Updated : 15 Jun 2024 19:36 IST

భర్త వివాహేతర సంబంధాన్ని పసిగట్టి.. అతడికి భార్య దేహశుద్ధి చేసిన ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ డీడీ కాలనీలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా ప్రవీణ్, అతని భార్య మెర్సీకి వివాదం తలెత్తడంతో ఇరువురూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల ప్రవీణ్‌పై అతని భార్య కేసు నమోదు చేసింది. ఓ యువతితో ప్రవీణ్ సహజీవనం చేస్తున్నాడని తెలుసుకొని.. తన పిల్లలతో కలిసి వారిద్దరిపై ఆమె దాడి చేసింది. ఘటనలో ప్రవీణ్ సైతం తన భార్యను తీవ్రంగా కొట్టాడు. వేధింపులకు గురిచేస్తోందంటూ భార్యపైనా ప్రవీణ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

మరిన్ని