Vizag: బిడ్డ ఆరోగ్యం కోసం తండ్రి తపన.. ఆక్సిజన్‌ సిలిండర్‌ మోసుకెళ్లి..

విశాఖలోని కేజీహెచ్‌లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 19 Jun 2024 12:26 IST

విశాఖలోని కేజీహెచ్‌లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ తండ్రి పడిన కష్టం నెట్టింట వైరల్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన శిరీష అనే గర్భిణిని కుటుంబసభ్యులు మంగళవారం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును ఎన్‌ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్‌ఐసీయూకు బయలుదేరారు. సమయానికి సిబ్బంది లేకపోవడంతో బిడ్డ తండ్రి ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన వేసుకొని నర్సు వెనుక నడిచారు. ఈ దృశ్యాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న ఆస్పత్రి పర్యవేక్షక వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు.

Tags :

మరిన్ని