Female Swimmer: 37 గంటల పాటు సముద్రంలో చిక్కుకున్న మహిళా స్విమ్మర్!

జపాన్‌లోని ఓ బీచ్‌లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు పసిఫిక్ సముద్రంలోకి కొట్టుకుపోయిన మహిళా స్మిమ్మర్‌ను ఆ దేశ కోస్ట్ గార్డ్ రక్షించింది.

Published : 11 Jul 2024 17:56 IST

జపాన్‌లోని ఓ బీచ్‌లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు పసిఫిక్ సముద్రంలోకి కొట్టుకుపోయిన మహిళా స్మిమ్మర్‌ను ఆ దేశ కోస్ట్ గార్డ్ రక్షించింది. హెలికాప్టర్ ద్వారా ఆ మహిళను కాపాడి సమీపంలోని నౌకలోకి తాడు సాయంతో దింపింది. అనంతరం నౌకలోని సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. పసిఫిక్ సముద్రంలో కొట్టుకుపోయిన మహిళ కోసం దాదాపు 37 గంటల పాటు జపాన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలించారు. స్మిమ్మింగ్ రింగ్ సాయంతో మహిళ తన ప్రాణాలు కాపాడుకుందని అధికారులు చెప్పారు. సముద్రంలో 80కి పైగా కిలోమీటర్ల దూరం వరకు ఆమె కొట్టుకుపోయిందని తెలిపారు. మహిళా స్విమ్మర్ చైనా దేశస్థురాలు అని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని