Hyderabad: కారులో చెలరేగిన మంటలు.. దగ్ధమైన వాహనం

హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని 6 నెంబర్ కూడలిలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఓ కారు దగ్ధమైంది.

Published : 06 Jul 2024 12:34 IST

హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని 6 నెంబర్ కూడలిలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఓ కారు దగ్ధమైంది. అకస్మాతుగా కారులో మంటలు రావడంతో.. అప్రమత్తమైన వాహనదారులు పక్కకు ఆపి దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు పక్కనే విద్యుత్ స్థంబాల పై నున్న తీగలకు అంటుకోవడంతో విద్యుత్ నిలిపివేశారు. కారు మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షపీకి చెందినదిగా గుర్తించారు. మంటలను గుర్తించి కారు పక్కకు ఆపడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

Tags :

మరిన్ని